తాండవం చేసిన లాలూ కుమారుడు : శివుడి వేషంలో.. ఆలయాలు తిరుగుతూ పూజలు

RJD నేత తేజ్ ప్రతాప్ యాదవ్ ఈమధ్య .. ఓ దళితుడి ఇంటికి వెళ్లి స్నానం చేశారు. ఆ తర్వాత సైకిల్ యాత్ర చేసిన విషయం తెలిసిందే. ఇలా అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న తేజ్ ప్రతాప్..ఇప్పుడు శివుడి అవతారమెత్తాడు. పులి చర్మం ధరించి, మెడలో రుద్రాక్షలు, కమాండలం, చెంబు చేతిలో పట్టుకుని అచ్చం శివుడి రూపంలో దర్శనమిచ్చారు. మంగళవారం (జూలై-31) పాట్నాలో ఉన్న ఓ శివాలయం దగ్గర ఇలా దర్శనమిచ్చారు.

శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తేజ్..శివుడిపై ఉన్న భక్తితోనే ఇలా చేశానన్నారు. ఇదే అవతారంతో ఆయన  డియోఘర్‌ లో ఉన్న బాబా బైద్యనాథ్ ఆలయానికి వెళ్లారు. అక్కడి నుంచి పాట్నాలోని  ఆలయాలన్నింటినీ ఇదే వేషంతో దర్శించుకున్నాడు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్. ఆలయంలోకి వెళ్లటం.. స్వయంగా పూజలు చేయటం, శంఖం పూరించటం, నృత్యాలు చేయటం వంటికి కూడా ఎంతో ఉత్సాహంగా చేస్తున్నాడు తేజ్. శివుడి వేషధారణలో ఉన్న తేజ్ పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ మ‌ధ్య‌ చాలా యాక్టివ్‌ గా ఉంటున్నారని ప్రశంసిస్తుండగా.. ఇదేం అవతారం  అంటూ ఎగతాలి చేస్తున్నారు మరికొందరు. ఎవరి వెర్షన్ ఎలా ఉన్నా.. తండ్రికి తగ్గ తనయుడే అంటున్నారు అందరూ. లాలూ కంటే ఓ అడుగు ముందుకేసి.. ప్రచారంలో దూసుకెళ్తున్నట్లు చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.

Posted in Uncategorized

Latest Updates