తాగి నడిపాడా? : యాక్సిడెంట్ కేసులో డైరెక్టర్ బాబీ లొంగుబాటు

bobby-car-accidentటాలీవుడ్ డైరెక్టర్ బాబీ (రవీంద్ర) పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మే 24వ తేదీ గురువారం రాత్రి 11.30గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో హాజరుఅయ్యాడు. అతనిపై ర్యాష్ డ్రైవింగ్ కేసు నమోదు అయ్యింది. వివరాల్లోకి వెళితే.. 20వ తేదీ ఆదివారం రాత్రి డైరెక్టర్ బాబీ ఓ పార్టీకి అటెండ్ అయ్యి.. ఇంటికి తిరిగి వస్తున్నాడు. జూబ్లీహిల్స్ నుంచి బంజారాహిల్స్ వస్తున్నాడు. ఇదే సమయంలో అమీర్ పేటకు చెందిన వ్యాపారి హర్మీందర్ సింగ్ (TS 08EJ 1786) కారులో తన కుటుంబ సభ్యులతో ఓ ఫంక్షన్ కు వెళ్లి తిరిగి వస్తున్నాడు. హర్మీందర్ సింగ్ కారు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 33 వెళుతున్న సమయంలో.. డైరెక్టర్ బాబీ కారు ఆయన వాహనాన్ని ఢీకొట్టింది. తప్పు తనది కాకపోయినా.. డైరెక్టర్ బాబీ కనీసం క్షమాపణ చెప్పకపోగా.. అసభ్యకరంగా తిట్టాడని వ్యాపారి హర్మీందర్ సింగ్ తన ఫేస్ బుక్ ద్వారా తెలిపాడు. అందుకు సాక్ష్యం అంటూ డ్యామేజ్ అయిన తన కారు ఫొటోలను కూడా పోస్ట్ చేశాడు.

యాక్సిడెంట్ అయిన సమయంలో బాబీ మద్యం తాగి ఉన్నాడనేది హర్మీందర్ సింగ్ ఆరోపణ. స్పాట్ నుంచి బాబీ వెళ్లిపోయాడని చెప్పారు. ర్యాష్ డ్రైవింగ్ పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆయన గురువారం రాత్రి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. బాబీ ఇటీవలే ఎన్టీఆర్ తో జైలవకుశ మూవీ తీశాడు.

Posted in Uncategorized

Latest Updates