తాగునీటి సమస్యలను తీర్చేందుకు రిజర్వాయర్లు: కేటీఆర్

ktrహైదరాబాద్ ఉప్పల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు మంత్రి కేటీఆర్.  సైనిక్ పురిలో శనివారం(ఏప్రిల్-7) ఉదయం మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీ మల్లారెడ్డితో పాటు మేయర్ బొంతు రామ్మోహన్ తో కలిసి … మంచినీటి రిజర్వాయర్ ను ప్రారంభించారు. తాగునీటి సమస్యను తీర్చేందుకు 4 కోట్ల 64లక్షలతో … 7 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో రిజర్వాయర్ ను నిర్మించినట్లు చెప్పారు. రిజర్వాయర్ ప్రారంభంతో స్థానిక ప్రజల నీటి తిప్పలు తప్పాయన్నారు కేటీఆర్. అటూ బోయిన్ పల్లిలో 20 కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అక్కడి ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు మంత్రి. చెర్లపల్లి చెరువు సమీపంలో 360 డబుల్ బెడ్ రూం ఇళ్లకు శంకుస్థాపన చేశారు.

Posted in Uncategorized

Latest Updates