తాగుబోతు తండ్రిపై పదేళ్లు కొడుకు తిరుగుబాటు : పెళ్లెందుకు చేసుకున్నావ్.. నన్నెందుకు కన్నావ్

10-Year-Old-Boy-Lodges-Complaint-Against-Fatherఇది ఓ పదేళ్ల పసివాడి కన్నీటి గాధ. పట్టుమని పదేళ్లు కూడా లేని ఈ బాబు ఇప్పుడు పోలీస్ స్టేషన్ గడప తొక్కాడు. అందరి పిల్లల్లా తాను ఆనందంగా నాన్నతో  గడపాల్సిన ఆ పసివాడు ఇలా పోలీస్ స్టేషన్లో కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. కన్నతండ్రి పెట్టే బాధలు తట్టుకోలేక పోలీసులకు కంప్లైంట్ చేశాడు. రోజూ తాగొచ్చి తల్లిని, తమను తండ్రి కొడుతున్నాడని బోరున ఏడుస్తూ తన బాధను పోలీసులకు చెప్పుకున్నాడు. ఇలా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు…. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి రోజూ ఇలాగే కొడుతున్నాడని చెప్పాడు.

కరీంనగర్ జమ్మికుంట మోత్కులగూడెంలో ఉండే శ్రీనివాస్ కొడుకే ఈ శశికుమార్. మద్యానికి బానిసైన శ్రీనివాస్ రోజూ తాగొచ్చి భార్య, కొడుకు శశికుమార్, కూతురును కొడుతున్నాడు. భార్య కూలీనాలీ చేసే తెచ్చిన పైసలే ఆ కుటుంబానికి ఆసరా. ఏనాడు కుటుంబాన్ని పట్టించుకోని శ్రీనివాస్…. తాగుడు పైసల కోసం భార్య, పిల్లలను హింసించేవాడు.  సర్కారీ స్కూల్లో చదువుతున్న శశికుమార్ తండ్రి ఆగడాలను భరించలేక పోలీస్ స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ చేశాడు. జమ్మికుంట సీఐకి తండ్రి శ్రీనివాస్ పెట్టే చిత్రహింసలను వివరించాడు. తండ్రి కొట్టిన దెబ్బలకు కమిలిన శరీరాన్ని చూపించాడు శశికుమార్. బాబు ఒంటిపై దెబ్బలను చూసిన పోలీసులు శ్రీనివాస్ ను స్టేషన్ కు పిలిపించారు. బాబును ఓదార్చి తన తండ్రిని ఏమడగాలనుకుంటున్నావో అడగమన్నాడు. తండ్రి పెడుతున్న బాధలకు ఆ పసిహృదయం సంధించిన ప్రశ్నలకు అక్కడున్న వారి హృదయాలు కరిగిపోయాయి.

Posted in Uncategorized

Latest Updates