తాజా తాజా.. టైమ్ ఆదా : మెట్రో స్టేషన్లలోనే రైతుబజార్

హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో ఇక నుంచి ఫ్రెష్ కూరగాయలు లభించనున్నాయి.  ప్రత్యేకంగా మార్కెట్ కు వెళ్లే అవసరంలేకుండా.. జర్నీలోనే కూరగాయలు కొనుక్కునే వీలును ప్రయాణికులకు  కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది హెచ్ఎంఆర్. ప్రయాణం తర్వాత ఇంటికి వెళ్తూ.. వెళ్తూ కొనుక్కొని వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు నగరంలోని అన్ని మెట్రో స్టేషన్లలో మన కూరగాయలు అనే పేరుతో స్టాల్స్ ఉండేలా వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు.

ముందుగా బాలానగర్‌ స్టేషన్లో మన కూరగాయలు స్టాల్ ను ప్రారంభించారు. పండించిన రైతుకు గిట్టుబాటు ధరను కల్పించడం.. వినియోగదారుడికి అందుబాటులోకి ఫ్రెష్ వెజిటేబల్స్  తీసుకు వచ్చేందుకు రైతు బజారు వ్యవస్థను ఇప్పటికే వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ అందుబాటులోకి తెచ్చింది. అయితే వీటిని మరి కొన్ని చోట్ల ఏర్పాటు చేయాలంటే కావాల్సిన స్థలం లేని పరిస్థితి అందుకే ‘మన కూరగాయలు’ అనే ఆలోచన చేసింది. ఈ క్రమంలో ఇప్పటికే నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 60 మన కూరగాయల స్టాల్స్ ను ఏర్పాటు చేసింది. వీటికి మంచి రెస్పాన్స్ రావడంతో.. మరిన్ని స్టాల్స్ కి ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో మెట్రో స్టేషన్లు చాలా అనువుగా ఉండడంతో వీటిని ఏర్పాట్లు చేసేందుకు ప్లాన్ చేశారు.

 

Posted in Uncategorized

Latest Updates