తాజ్‌మహల్‌ పరిరక్షణ ఎవరు తీసుకుంటారు: సుప్రీం కోర్టు

ప్రముఖ చారిత్రాత్మక కట్టడం…ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ పరిరక్షణకు సంబంధించి సుప్రీం కోర్టు కేంద్రం,యూపీ ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజ్‌మహల్‌ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై గతనెల 31 నుంచి రోజువారీ విచారణ చేపడుతోంది కోర్టు. ఇందులో భాగంగా శుక్రవారం (జూలై-27) కూడా దీనిపై విచారణ జరిగింది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా యునెస్కో వారసత్వ గుర్తింపు కోల్పోయే ప్రమాదంలో తాజ్‌ పడిందని ఆందోళన వ్యక్తం చేసింది. రెండు ప్రభుత్వాల్లో తాజ్‌ పరిరక్షణ, నిర్వహణ బాధ్యతలు ఎవరు తీసుకుంటారో మీరే తేల్చుకోవాలని  కేంద్రం, యూపీ ప్రభుత్వాలకు సూచించింది సుప్రీం కోర్టు.

Posted in Uncategorized

Latest Updates