తాజ్ మాదే… షాజహాన్ రాసిచ్చాడు : సున్నీవక్ఫ్ బోర్డు

TAJ ప్రపంచంలోని 7 వింతల్లో ఒకటైన ప్రఖ్యాత కట్టడం తాజ్ మహల్ తమదేనంటూ వాదిస్తోంది యూపీ సున్నీ వక్ఫ్ బోర్డు. తాజ్ నిర్మాత షాజహాన్ దానిని తమకు రాసిచ్చాడని మంగళవారం(ఏప్రిల్-10) సుప్రీంకోర్టుకి తెలిపింది. దీనిపై స్పందిన సుప్రీంకోర్టు…. తాజ్‌మహల్‌ వక్ఫ్‌ బోర్డుకు చెందుతుందని షాజహాన్‌ చేసిన డిక్లరేషన్‌ కాకుండా మరేదైనా షాజహాన్ రాసిచ్చిన పత్రాలు ఉంటే న్యాయస్ధానం ముందు ప్రవేశపెట్టాలంటూ, ఇందుకు వారం రోజుల గడువు ఇస్తున్నట్లు సున్నీ వక్ఫ్ బోర్డుకు సూచించింది. తాజ్‌మహల్‌ వక్ఫ్‌ బోర్డుకు చెందినదంటే భారతదేశంలో ఎవరు నమ్ముతారు? అంటూ సున్నీ బోర్డును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ప్రశ్నించారు. ఇటువంటి కేసుల కారణంగా విలువైన కోర్టు సమయం వృథా అవుతుందన్నారు. తన భార్య ముంతాజ్‌ గుర్తుగా  తాజ్‌ మహల్‌ను నిర్మించారు షాజహాన్‌. 1658లో షాజహాన్‌ మరణించారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత  తాజ్‌మహల్‌ తో పాటుగా దేశ సాంస్కృతికతను తెలియజెప్పే కట్టడాలను కాపాడే బాధ్యతను ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(ASI) తీసుకుంది.

Posted in Uncategorized

Latest Updates