తాటిచెట్టుపైనే ఆగిపోయిన గీత కార్మికుడి ఊపిరి

taatiకల్లు గీతే జీవనాధారంగా బతుకీడుస్తున్న ఓ గీత కార్మికుడి చివరి శ్వాస…తాటిచెట్టుపైనే ఆగిపోయింది. దీంతో ఆయన కుటుంబం వీధిన పడింది. వరంగల్ జిల్లా మధ్యకోటకు చెందిన 35 ఏళ్ల పోశాల నాగరాజుగౌడ్‌…గీత కార్మికుడు. రోజువారీగానే కల్లు గీసేందుకు శనివారం(జూన్-16) సాయంత్రం 4 గంటలకు కుమ్మరికుంటలోని తాటి చెట్టు ఎక్కాడు. అయితే తాటి చెట్టుపైన ఉండగానే గుండెపోటు వచ్చి మృతిచెందాడు. కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి 6 గంటలకు తాటి చెట్టు దగ్గరకు వెళ్లి చూడగా అప్పటికే నాగరాజుగౌడ్‌ మృతిచెంది చెట్టుపైన మోకుముస్తాదుతో వేలాడుతున్నాడు.

సమాచారం తెలుసుకున్నపోలీసులు, ఫైర్‌ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని… స్థానిక గీత కార్మికుల సాయంతో మృతదేహాన్ని కిందకు దించారు. మృతుడికి భార్య శైలజ, ఒక కూతురు ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం MGM ఆస్పత్రికి తరలించారు. శైలజ ఫిర్యాదు తో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారున్నట్లు మిల్స్‌కాలనీ పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates