తాట తీసింది : ఆకతాయిని చితకొట్టిన యువతి

వెంటపడి వేధిస్తున్న ఆకతాయికి తగిన బుద్ది చెప్పింది ఓ యువతి(19). అందరి ముందు కర్రతో చితకొట్టింది. ఆ అమ్మాయికి స్థానికులు మద్దతుగా నిలిచారు. ఈ ఘటన రాజస్థాన్ లోని భరత్ పూర్ లో జరిగింది. ఉదయం రన్నింగ్ ప్రాక్టీస్ కు వెళ్తున్న ఆ యువతి వెంట పడుతూ మాటలతో వేధిస్తున్నాడు ఓ యువకుడు.  ఆ వేధింపులు కాస్తా శృతి మించడంతో యువకుడిని చితకబాదింది. స్థానికుల సహకారంతో ఆ యువకుడిని కర్రతో ఉతికి ఆరేసింది. ఈ ఘటనను కొందరు మొబైల్ తో వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో వైరల్ అయింది.

ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకూ ఎవరూ కంఫ్లెయింట్ చేయలేదని, ఐదు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై యువతి కూడా కంప్లెయింట్ చేయలేదనిభరత్ పూర్ ఎస్పీ అనీల్ టాన్క్ తెలిపారు. భాధిత యువతి పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతుందని, అందులో భాగంగానే ప్రతిరోజూ ఉదయం ఆ ఏరియాలో రన్నింగ్  ప్రాక్టీస్ చేస్తుందని, ఆ క్రమంలోనే ఈ ఘటన జరిగిందనికొత్వాలీ పోలీస్ స్టేషన్ ఏరియా SHO రాజేష్ కుమార్ తెలిపారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవడంతో స్పందించిన భరత్ పూర్ పోలీసులు… కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. యువతి ధైర్యాన్ని మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు యువతిని అభినందిస్తున్నారు. ఇంకెవరైనా అమ్మాయిలను వేధించాలని చూస్తే వాడికి కిందా పైనా కోసి కారం పెట్టాలంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates