తాట తీస్తాం : లంచం అడిగితే ఈ నెంబర్ కు ఫోన్ చేయండి

tsacb

అవినీతిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ప్రభుత్వ శాఖల్లో లంచావతారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే.. అవినీతి నిరోధక శాఖ (ACB)కి మరింత పటిష్టం చేస్తోంది. అందులో భాగంగా.. అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో టోల్ ఫ్రీ నెంబర్ ప్రకటించారు. ఎవరైనా లంచం అడిగితే.. 1064 నెంబర్ కు కాల్ చేయాలని డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి ప్రజలను కోరారు. లంచం అడిగే ఉద్యోగుల సమాచారం ఇచ్చిన వ్యక్తులు, సంస్థల వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. లంచం అడగటం, ఇవ్వటం, తీసుకోవటం నేరంగా వెల్లడించారు. 1064 టోల్ ఫ్రీ నెంబర్ అని.. ప్రజల్లో అవగాహన కోసం విస్త్రృతంగా ప్రచారం చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేపడుతున్నట్లు తెలిపారు.

లంచం ఇవ్వకుండా.. కంప్లయింట్ చేసినప్పుడు న్యాయం జరుగుతుందన్నారు. అప్పుడే అవినీతి నిరోధక శాఖ సమర్ధవంతంగా పని చేస్తుందన్నారు. ప్రజలు అందరూ కూడా అవినీతిరహిత సమాజం కోసం తమ వంతు బాధ్యతగా ముందుకు రావాలన్నారు. అవినీతి ఏ రూపంలో ఉన్నా.. ఎక్కడ జరుగుతున్నా.. మీ దృష్టికి వస్తే వెంటనే 1064 నెంబర్ కు కాల్ చేసి చెప్పాలన్నారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం అని భరోసా ఇచ్చారు ఆఫీసర్..

Posted in Uncategorized

Latest Updates