తాడాట ప్రాణం తీసింది.. టగ్ ఆఫ్ వార్ లో విషాదం

మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. టగ్ ఆఫ్ వార్(తాడాట) ఆడుతూ ఓ నర్సింగ్ స్టూడెంట్ ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ముంబైలోని  కేజే సోమయ్య స్కూల్ అండ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కాలేజీలో జరిగింది. కాలేజీ వార్షికోత్సవ క్రీడా పోటీల సందర్భంగా నిన్న(శుక్రవారం) టగ్ ఆఫ్ వార్ ఆడుతుండగా.. ఆ కాలేజీలో నర్సింగ్ చదువుతున్న కేరళకు చెందిన 19 ఏళ్ల జిబిన్ సన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

దీంతో కాలేజి సిబ్బంది వెంటనే అతడిని సమీపంలోని రాజ్ వాడీ హాస్పటల్ కు తరలించారు. సన్నీని పరీక్షించిన డాక్టర్లు అప్పటికే అతడు మృతి చెందినట్లు తెలిపారు. తర్వాత సన్నీ బాడీని కెమికల్ అనాలసిస్ చేసిన డాక్టర్లు తాడును బలంగా లాగడంతో ఆ ప్రభావం గుండె పై పడి ఉంటుందని.. అదే విధంగా సన్నీ కిందకు పడటంతో అతడి బ్రెయిన్ దగ్గర దెబ్బ తగిలిందని.. ఈ కారణాలతోనే చనిపోయి ఉంటాడని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates