తాత్కాలికంగా నిలిచిన వైష్ణోదేవి యాత్ర

vaishnodeviవైష్ణో దేవి యాత్రను తాత్కాలికంగా నిలిపేశారు. శుక్రవారం(మార్చి-30) భారీ స్థాయిలో భక్తులు పోటెత్తడంతో శనివారం(మార్చి-31) ఆ యాత్రను నిలిపేశారు. కట్రా బేస్ నుంచి వస్తున్న భక్తులను ప్రస్తుతానికి నిలిపేసినట్లు సమాచారం. భక్తుల తాకిడి అధికంగా ఉందని, నిన్న(శుక్రవారం) రాత్రి 8 గంటలకు టికెట్ కౌంటర్‌ను మూయాల్సి వచ్చిందన్నారు అధికారులు. మాతా వైష్ణో దేవి దర్శనం కోసం సుమారు 41 వేల మంది భక్తులు క్యూకట్టినట్లు తెలుస్తోంది. కట్రా బేస్ దగ్గర మరో 20 వేల మంది వేచి ఉన్నట్లు సమాచారం. సగటున ప్రతి రోజు 40 వేల మంది భక్తులు ఆలయానికి వస్తున్నట్లు అంచనా.

 

Posted in Uncategorized

Latest Updates