తార్నాకలో ఓటేసిన కోదండరామ్‌


హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి నేతలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ప్రజాకూటమి ఛైర్మన్‌ కోదండరామ్‌ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. తార్నాకలో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

కూకట్‌పల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నందమూరి సుహాసిని నాంపల్లి హుమయూన్‌ నగర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇబ్రహీంపట్నం బీఎస్పీ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి ,ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates