తాలిపేరుకు వరద ప్రవాహం :14 గేట్లు ఎత్తివేత

 సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం నుంచి ఎడతెరఫి లేకుండా కురిస్తున్న భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్ట్‌లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ఇవాళ ఉదయం ప్రాజెక్ట్‌కు చెందిన 25 క్రషర్‌ గేట్లలో 14 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి ఉంచి 9234 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీనితో తాలిపేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.

ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 74.00 మీటర్లు కాగా, ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద ఉధృతి నేపథ్యంలో 72.97 మీటర్ల వద్ద నీటిమట్టాన్ని క్రమబద్ధీకరిస్తున్నారు. ప్రాజెక్ట్‌ డీఈ తిరుపతి, జేఈ వెంకటేశ్వరావు ప్రాజెక్ట్‌ వద్ద ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates