తాలిబన్ల దాడి : 8 మంది పోలీసులు మృతి

ఆఫ్ఘనిస్థాన్‌ లోని ఘజినీ ప్రావిన్స్‌ లో తాలిబన్లు దుశ్చర్యకు పాల్పడ్డారు. శుక్రవారం (జూలై-20) కారబాగ్ జిల్లాలోని పోలీసు సెక్యూరిటీ పోస్టుపై తాలిబన్లు దాడులు చేశారు. ఈ దాడుల్లో 8 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు తాలిబన్ల అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ప్రకటించారు. తాలిబన్ల దాడితో అక్కడి భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.

Posted in Uncategorized

Latest Updates