తిట్టినోళ్లకు థ్యాంక్స్ : పవన్ కు సపోర్ట్ గా మెగా హీరోల రియాక్షన్స్

pawan-commentsశ్రీరెడ్డి వ్యవహారం ఇప్పుడు ఛానల్స్ ను దాటి.. సభలకి వచ్చేసింది. సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై జూనియర్ ఆర్టిస్టులతో జరిగిన మీటింగ్ లో పవన్ కల్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రచ్చ రచ్చ అవుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కామెంట్స్ చేయటం.. ఆ తర్వాత సారీ చెప్పటం జరుగుతుంది. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై శ్రీరెడ్డి, ఇతర జూనియర్ ఆర్టిస్టులు చేసిన కామెంట్స్ పై మెగా ఫ్యాన్ హీరోలు బయటకు వచ్చారు. కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో హీరోలు నితిన్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ కూడా ఉన్నారు. పవన్ కు సపోర్ట్ గా మెగా హీరోలు సైతం రంగంలోకి దిగటంతో.. ఒక్కసారిగా ఇది మరింత పెద్ద ప్రచారం అయిపోయింది.

ప్రతి చర్యకి వెయిట్ చేయండి : నితిన్

ఏ చర్యకి అయినా ప్రతిచర్య ఉంటుంది. అందుకోసం వెయిట్ చేయండి. త్వరలో ప్రతిచర్య రాబోతుందని వార్నింగ్ ఇచ్చాడు హీరో నితిన్. టాలీవుడ్ మహిళా నటులు పవన్ కల్యాణ్ పై ఇష్టానుసారం కామెంట్స్ చేస్తున్న క్రమంలో నితిన్ చూపించబోయే ప్రతి చర్య ఏంటా అని ఆసక్తి నెలకొంది.

అద్దంలో చూసుకుంటే మంచిది : వరుణ్ తేజ్

కపట వేషదారులు, నీపై విమర్శలు చేస్తూ నిన్ను నేలకీడ్చాలని చూసేవాళ్ల గురించి పట్టించోవాల్సిన అవసరం లేదు. అవతలి వాళ్లను చెడ్డొళ్లను చేయాలన్న ప్రయత్నం సులువైనదే.. కానీ అలా చేసే ముందు వాళ్లకు వాళ్లు ఓ సారి అద్దంలో చూసుకుంటే మంచిది అంటూ మెగా హీరో వరుణ్ తేజ్ ట్విట్ చేశాడు.

భరించటం వల్లే వచ్చే శక్తి.. బలమైనది : సాయి ధరమ్ తేజ

కట్టాలుంటాయ్ పాలిటిక్స్ లో. నన్ను తిడుతుంటే ఒక్కోసారి మీకు ఇబ్బంది కలగొచ్చు. నేను భరిస్తాను.. బలవంతుడే భరిస్తాడు.. మనం ఎంత. బలమైన వ్యక్తులం.. భరిద్దాం. భరించిన వాడే సాధించగలడు. అంతేగానీ మాట అన్నారని భయపడి పారిపోతే ఎలా.. అలా అయితే నిన్ను తిట్టేవారు విజయం సాధించినట్లే కదా.. అలా పారిపోవద్దు. అలా అని ఎదురుదాడి కూడా చేయొద్దు. భరించండి. చూడండి.. ఎంతసేపు అంటారో చూడండి.. మార్పు చాలా సైలెంట్ గా వచ్చేస్తుంది అంటూ కార్యకర్తలను ఉద్దేశించి పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగంలోని పాయింట్లను పోస్ట్ చేశాడు మెగా హీరో సాయి ధరమ్ తేజ

సినీ ఇండస్ట్రీలోని మహిళా నటులు, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలో ఇప్పుడు మెగా హీరోలు కూడా ఎంట్రీ ఇవ్వటం మరింత ఆసక్తికరంగా మార్చింది.

Posted in Uncategorized

Latest Updates