‘తిత్లీ’ ఎఫెక్ట్: సౌత్ సెంట్రల్ రైల్వే అలర్ట్

తిత్లి తుఫాన్ ఎఫెక్ట్ తో సౌత్ సెంట్రల్ రైల్వే అలర్ట్ అయ్యింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని.. తుఫాన్ తీవ్రత దృష్ట్యా 10 రైళ్లను క్యాన్సిల్ చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ CPRO ఎం.ఉమాశంకర్ తెలిపారు.  9 రైళ్లు వైజాగ్ వరకు వెళతాయని… 18 రైళ్లను డైవర్ట్ చేసి, 5 రైళ్లను రీ షెడ్యూల్ చేశామని ఆయన చెప్పారు.

పాసింజర్స్ 138,139 నెంబర్స్ ద్వారా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చన్నారు. సికింద్రాబాద్,విజయవాడలో ఎమర్జెన్సీ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశామని ..ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులతో మాట్లాడుతూ పరిస్థితిని తెలుసుకుంటున్నామన్నారు.

Posted in Uncategorized

Latest Updates