తిత్లీ : 26కి చేరిన మృతుల సంఖ్య

భువనేశ్వర్ : ఒడిశా రాష్ట్రంలోని 16 జిల్లాల్లో తిత్లీ తుపాను బీభత్సం సృష్టించింది. తిత్లీ తుపాను ధాటికి మొన్నటి వరకు పన్నెండు మంది మృతి చెందగా.. తాజాగా ఆ సంఖ్య 26కు చేరింది. 16 జిల్లాల్లోని 7402 గ్రామాలు తుపాను ధాటికి దెబ్బతిన్నాయి. 3.6 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. 2.34 లక్షల హెక్టార్ల పంట దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న కుటుంబాలకు రూ. 1000, 50 కేజీల బియ్యం, 2 లీటర్ల కిరోసిన్ చొప్పున సరఫరా చేయాలని సీఎం నవీన్ పట్నాయక్ అధికారులను ఆదేశించారు.

Posted in Uncategorized

Latest Updates