తిని చావాల్సిందే : జంక్ ఫుడ్ యాడ్స్ బ్యాన్ చేయలేం

cheat_meal-1024x682టీవీల్లో జంక్‌ ఫుడ్‌కు సంబంధించి బిజినెస్ యాడ్స్  నిషేధించే ఆలోచన లేదని వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. జంక్ ఫుడ్ యాడ్స్ కు సంబంధించి గురువారం (ఫిబ్రవరి-8) లోక్ సభలో ప్రశ్నోత్తరాల్లో మాట్లాడారు ఎంపీలు.  పిల్లలకు సంబంధించిన యాడ్స్ ను బ్యాన్ చేయాలని ..ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్‌ అలయన్స్‌ ఆఫ్‌ ఇండియా (FBIA ) స్వతంత్రంగా నిర్ణయం తీసుకుందని చెప్పారు  కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి రాజ్‌వర్ధన్‌ సింగ్‌.

పిల్లల ఆరోగ్యంపై జంక్‌ ఫుడ్‌ ప్రభావం చూపుతోందని ఎంపీలు ప్రశ్నించగా ఆ శాఖ మంత్రి స్మృతీ ఇరానీ సమాధానమిచ్చారు.   సమస్య పరిష్కారానికి నిపుణుల బృందాన్ని ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI ) నియమించిందని చెప్పిన స్మృతీ.. కొవ్వులు, చక్కెర, ఉప్పు గల ఆహార పదార్థాలను కిడ్స్  ఛానళ్లల్లో ప్రసారం చేయకుండా నిషేధించాలని ఆ బృందం నివేదికలో సూచించిందని చెప్పారు . దీంతో ఈ విషయంపై ప్రస్తుతానికి యాడ్స్ నిషేధించే ఆలోచన అయితే లేదని చెప్పింది కేంద్రం.

 

Posted in Uncategorized

Latest Updates