తిరగబడిన ప్రజలు : జోర్డాన్ ప్రధానమంత్రి రాజీనామా

jordజోర్డాన్ ప్రధానమంత్రి హనిముల్కీ తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం(జూన్-4) తన రాజీనామా లేఖను జోర్డాన్ కింగ్ అబ్ధుల్లాకి అందజేశారు. 2016 లో ప్రధానమంత్రిగా హనిముల్కీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన తీసుకున్న ఆర్ధికపరమైన నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి.  ప్రభుత్వంపై పెద్ద ఎత్తున్న ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. ఈ నిరసనల్లో వందల సంఖ్యలో ఆందోళనకారులను అరెస్ట్ చేశారు.

పర్సనల్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ లను తొలగించాలన్న డిమాండ్ ను అంగీకరించకపోగా.. కొనసాగించటానికే మొగ్గు చూపారు. దీనికితోడు ప్రభుత్వ శాఖల్లో అవినీతిని కంట్రోల్ చేయలేకపోవటాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు ప్రజలు. కార్పొరేట్ ట్యాక్స్ వల్ల ప్రైవేట్ కంపెనీల్లో పని చేస్తున్న లక్షల మంది ఉద్యోగులు కూడా జోర్దాన్ దేశ బంద్ కు కూడా పిలుపునిచ్చారు. ఆర్థిక సంస్కరణల పేరుతో జనం చేతిలో చిల్లిగవ్వ లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆందోళనకారులు. డిమాండ్లను పరిష్కరించకుండా.. ప్రభుత్వం అణిచివేత ధోరణి, అరెస్ట్ లపై భగ్గుమన్నారు జోర్దాన్ ప్రజలు. రోడ్లపైకి వచ్చారు. ఆదివారం (జూన్-3) లక్షల మంది ప్రజలు జోర్డాన్ దేశ రాజధాని అమన్, ఇతర ప్రధాన నగరాల్లో కదం తొక్కారు. ప్రధానమంత్రి హనీముల్కీ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. ప్రజల ఆగ్రహంతో.. సోమవారం తన పదవికి ప్రధానమంత్రి రాజీనామా చేశారు.

Posted in Uncategorized

Latest Updates