తిరుపతిలో ఎర్రచందనం ముఠా అరెస్ట్

ERRAతిరుపతిలో వ్యవసాయం చేసే వారిగా చెలామణి అవుతూ.. రాత్రి సమయంలో ఎర్రచందనం రవాణా చేస్తున్న స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ సిబ్బంది పట్టుకున్నారు. లక్ష్మీపురం చెరువు ప్రాంతంలో తనిఖీలు చేస్తున్న టాస్క్ ఫోర్స్ సిబ్బందికి పాదముద్రలు కనిపించాయి. వాటిని అనుసరిస్తూ వెళ్లిన సిబ్బందికి.. చెరుకు చేనులో స్మగ్లర్లు కనిపించారు. పట్టుకునేందుకు ప్రయత్నించగా.. రాళ్లతో దాడి చేస్తూ పరారయ్యారు. వారిని వెంబడించిన టాస్క్ ఫోర్స్ సిబ్బంది 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురు పారిపోయారు. దట్టమైన పొదల్లో దాచిన 12 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates