తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ కన్నుమూత

తిరుపతి ఎంపీ, YCP నేత బల్లి దుర్గాప్రసాద్‌ బుధవారం కన్నుమూశారు. ఇటీవల కరోనా వైరస్‌ బారిన పడిన ఆయన చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతుండగా దుర్గాప్రసాద్‌కు తీవ్ర గుండెపోటు రావడంతో ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. దుర్గాప్రసాద్‌ మరణంతో ఆయనకుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బల్లి దుర్గాప్రసాద్‌ చనిపోవడంపై YCP పార్టీ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

బల్లి దుర్గాప్రసాద్‌ స్వస్థలం నెల్లూరు జిల్లా వెంకటగిరి. 1985లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన …28 ఏళ్లకే తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నెల్లూరు జిల్లా గూడురు నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేశారు. 1994లో చంద్రబాబు కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.  ఆ తర్వాత 2019 ఎన్నికల్లో YCPలో చేరి తిరుపతి ఎంపీగా ఎన్నికయ్యారు బల్లి దుర్గాప్రసాద్‌.

బల్లి దుర్గాప్రసాద్‌ మరణం పట్ల  సీఎం జగన్మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.

Latest Updates