తిరుపతి వెంకన్నను దర్శించుకున్న కేటీఆర్ ఫ్యామిలీ

తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నది తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఫ్యామిలీ. కేటీఆర్ భార్య శైలిమ, కొడుకు హిమన్షు, కూతురు అలేఖ్య ఇవాళ(గురువారం) స్వామివారిని దర్శించుకున్నారు… మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం అందించారు. తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు మంత్రి కొడుకు హిమన్షును స్వామివారి పట్టువస్ర్తాలతో సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Posted in Uncategorized

Latest Updates