తిరుమలకు మెట్లమార్గంలో వచ్చిన ఆవు

COWతిరుపతి నుంచి తిరుమల కొండపైకి మెట్లమార్గంలో వచ్చింది ఓ ఆవు. కొండపైకి తమతో పాటు నడిచి వస్తున్న గోవుకు మార్గమధ్యలో భక్తులు పూజలుచేశారు. అలిపిరి మార్గంలో కొండపైదాకా… గోవుతో పాటు ఉత్సాహంగా నడుచుకుంటూ వచ్చారు. గోమాత తిరుమలకు కాలినడకన రావడాన్ని భక్తులు విశేషంగా చెప్పుకున్నారు. సమాచారం అందుకున్న టీటీడీ ఫారెస్ట్ అధికారులు కొండపైకి వచ్చిన ఆవును గోశాలకు తీసుకుపోయారు.

Latest Updates