తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఇవాళ అంకురార్పణ

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఇవాళ(అక్టోబర్-9) అంకురార్పణ జరగనుంది. ఈ బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 10 నుంచి మొదలై 18 వరకు కొనసాగనున్నాయి. అధిక మాసం సందర్భంగా ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు వచ్చాయి. వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్.13 నుంచి 21 వరకు జరిగాయి.

బుధవారం ఉదయం నుంచి  శ్రీ దేవి,భూదేవి సమేత మలయప్ప స్వామి రోజుకో వాహనం పై వివిధ రూపాల్లో తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ దర్శనిమిస్తారు.బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం,ధ్వజావరోహణం ఉండవు. 14న గరుడ వాహనం,15న పుష్పక విమానం,17న స్వర్ణ రథం వాహన సేవలు,18న చక్రస్నానం ఉంటాయి.

Latest Updates