తిరుమలలో 16 నెలల బాబు కిడ్నాప్

తిరుమలలో 16నెలల బాబు కిడ్నాప్ అయ్యాడు. మహారాష్ట్రలోని లాతూర్ కు చెందిన కుటుంబం వెంకటేశ్వరస్వామి దర్శనానికి  వెళ్లారు. గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. వారికి గదులు దొరక్కపోవడంతో.. కొండపై ఉన్న మాధవ నిలయం పక్కన నిద్రించారు. పొద్దున 7.45 నిమిషాలకు లేచి చూసుకుంటే.. బాబు కనిపించలేదు. కంగారుపడ్డ తల్లిదండ్రులు తిరుమల అంతా గాలించారు. పోలీసు స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చారు.

తిరుమలలోని అన్ని ప్రాంతాల సీసీటీవీ ఫుటేజిని పోలీసులు పరిశీలించారు. ఓ 40 ఏళ్ల వ్వక్తి మంకీ క్యాప్ పెట్టుకుని బాబును ఎత్తుకెళ్లిన దృశ్యాలు అందులో ఉన్నాయి. ఆరు బృందాలుగా ఏర్పడిన పోలీసులు గాలింపు చేపట్టారు. ఎవరికైనా బాలుడి సమాచారం తెలిస్తే.. 8099999977, 9440796769,9494868480 నంబర్లకు ఫోన్ చేసి చెప్పాలని కోరారు. 

Latest Updates