తిరుమలేశుని గరుడసేవకు భారీ భద్రత 

ఈనెల 14 (ఆదివారం) నుండి తిరుమల తిరుపతిలో శ్రీవారికి గరుడసేవ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో భక్తులు రానున్నారు. దీంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతి సారధ్యంలో మొత్తం 4వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లను చేశారు. 13వ (శనివారం) తేది అర్ధరాత్రి నుండి తిరుమలకు బైక్ లను నిరాకరించారు. మొత్తం 7వేల వాహనాలను పార్కింగ్ చేసేలా ఏర్పాట్లు చేశారు. ఆర్టీసి బస్సులు, ప్రైవేట్ వాహనాలు ప్రత్యేకంగా అనుమతించనుండగా పార్కింగ్ ప్రదేశాలు కోసం ప్రత్యేక యాప్ ను కూడా అందుబాటులోకి తెచ్చారు. దర్శన గ్యాలరీలలో కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు.

Latest Updates