తిరుమల కొండపై అపచారం : భూదేవి విగ్రహం కింద పడిందా!

tirumalaతిరుమల కొండపై అపచారం జరిగిందా.. వేంకటేశ్వరస్వామి సతీమణి అయిన భూదేవి ఉత్సవ విగ్రహం కింద పడిందా.. అమ్మవారి విగ్రహం దెబ్బతిన్నదా.. ఇప్పుడు ఇదే చర్చనీయాంశం అయ్యింది. శ్రీవారి సన్నిధిలోని రాములవారి మేడ దగ్గర భూమి అమ్మవారి విగ్రహం కింద పడినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై టీటీడీ అధికారులు మాత్రం మౌనంగా ఉంటున్నారు. అర్చకులు సైతం నోరు విప్పటం లేదు. సోమవారం మధ్యాహ్నం ఆలయం బయట వైభవోత్సవ మంటపంలో ఆర్జిత బ్రహ్మోత్సవరం, వసంతోత్సవంలో భాగంగా శ్రీదేవి, భూదేవితో సహా మలయప్పస్వామి భక్తులకు దర్శనం ఇచ్చారు.

ఆ తర్వాత రోజువారీగా సాయంత్రం 6 గంటలకు నిర్వహించే సహస్ర దీపాలంకార సేవను సోమవారం రద్దు చేశారు. దీంతో స్వామి విగ్రహాలను మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఆలయం లోపలికి తీసుకెళుతున్నారు అర్చకులు, సిబ్బంది. ఈ సమయంలోనే రాములవారి మేడ దగ్గర ప్రమాదవశాత్తు భూదేవి విగ్రహం కింద పడినట్లు సమాచారం. దీంతో విగ్రహ కిరీటంతోపాటు పీఠం భాగం స్వల్పంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. అర్చకులు కూడా మాట్లాడటం లేదు. ఇంత జరుగుతున్నా.. ఎవరూ స్పందించటం లేదు. అసలు విగ్రహం కింద పడకపోతే.. వెంటనే ఖండించాలి కదా.. ఎందుకు స్పందించటం లేదు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Posted in Uncategorized

Latest Updates