తిరుమల దేశానికే తలమానికం : పీయూష్ గోయల్

PIYUSHతిరుమల శ్రీవారి ఆలయం దేశానికే తలమానికమన్నారు.. రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్. శుక్రవారం (జూన్-15) ఉదయం తిరుమల వచ్చిన కేంద్రమంత్రి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. గోయల్ దంపతులకు పూజారులు ఆశీర్వచనాలు, స్వామివారి ప్రసాదం అందజేశారు. ప్రతి ఏడాది జూన్ లో శ్రీవారిని దర్శించుకుంటున్నట్లు చెప్పారు పీయూష్ గోయల్. తిరుమలలో ఏర్పాట్లు, పరిశుభ్రత బాగుంటాయన్నారు.

Latest Updates