తిరుమల నడకదారిలో ఏనుగుల భయం.. రాకపోకలపై ఆంక్షలు

TTD ELEPHANTతిరుమల శ్రీవారి పాదాల దగ్గర ఏనుగులు హల్ చల్ చేశాయి. కాలినడక ప్రాంతంలో శ్రీవారి పాదాల దగ్గర ఉన్న అటవీ ప్రాంతంలో.. గజరాజుల గుంపు సంచారంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే స్పందించిన అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు. శ్రీవారి పాదాల దగ్గరకు వచ్చే భక్తులను నిలిపివేశారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా.. అన్నమయ్య మార్గాన్ని మూసివేశారు. ఉదయం నుంచి ఏనుగులు రోడ్డుపై ఉండడంతో భక్తులు భయపడుతున్నారు. అటవీశాఖ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.

ఏనుగు సంచారంతో.. శ్రీవారి పాదాల మార్గంలో నడకదారి భక్తుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. సాధారణంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు శ్రీవారి పాదాల మార్గంలో భక్తులను అనుమతిస్తారు. అయితే.. ఇప్పుడు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే భక్తులను అనుతిస్తున్నారు. అంతే కాకుండా ఈ ప్రాంతంలో భద్రాతా సిబ్బంది ప్రత్యేక నిఘా పెట్టారు. సోమవారం (జూన్-11) భక్తులతాకిడితో తిరుమల కొండ కిటకిటలాడుతోంది. వేసవి సెలవులు ముగిసినా భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో ఏడుకొండలు భక్తజనసంద్రంగా మారాయి. సర్వదర్శనానికి 30 గంటలకు పైగా సమయం పడుతోంది. నిన్న ఒక్కరోజే లక్ష మందికి పైగా రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం, రూముల కోసం గంటలు తరబడి ఇబ్బందులు పడుతున్నారు భక్తులు. తిరుగు ప్రయాణంలో ఇంటికి వెళ్ళాలన్నా బస్సులు లేక అవస్థ పడుతున్నారు. బస్సు రాగానే సీట్లకోసం పరుగులు పెడుతున్నారు. ప్రమాదమని తెలిసినా సీట్ల కోసం తప్పడం లేదంటున్నారు భక్తులు.

Latest Updates