తిరుమల వివాదాలకు అధికారులే కారణం : పరిపూర్ణానంద

PARIPURNANANDAతిరుమలలో  జరుగుతున్న వివాదాలకు  ముఖ్య కారణం  అధికారులు, ఉద్యోగులు,  అర్చకుల  మధ్య  సమన్వయ  లోపమే  అన్నారు … శ్రీపీఠం  వ్యవస్థాపకులు  పరిపూర్ణానంద  స్వామి.  దీనిపై  ప్రభుత్వం  స్పందించి  సమన్వయ  కమిటీ  ఏర్పాటు  చెయ్యాలని  డిమాండ్ చేశారు.  సోమవారం (జూలై-2) శ్రీవారి  దర్శనానికి తిరుమల  వచ్చిన  పరిపూర్ణానందకు.. ఆలయ  అధికారులు  స్వాగతం  పలికి దర్శన  ఏర్పాట్లు చేశారు.  అధికారులు,  సిబ్బంది,  అర్చక బృందాల  మధ్య సమన్వయ  లోపంతో.. భక్తులకు  వివాదాలను  చూపించటం  మంచి  పద్ధతి కాదన్నారు  పరిపూర్ణానంద.

TTD లో  పని చేసే  ముఖ్యమైన  నాలుగు విభాగాల  నుంచి.. నిజాయితీ  గల  వ్యక్తుల్ని  ఎన్నుకొని.. సమన్వయ  కమిటీ ఏర్పాటు  చేయాలన్నారు. తిరుమలలో  జరుగుతున్న  వివాధాలకు  ముగింపు పలకాలన్నారు.  భక్తులు కూడా  ప్రభుత్వం వెంటనే  స్పందించాలని కోరుకుంటున్నారని  చెప్పారు .

Latest Updates