తీన్మార్ స్టెప్పులతో: వరంగల్ నిట్ లో కల్చరల్ ఈవెంట్స్

కల్చరల్ ఈవెంట్స్ పై నిట్ లో పదిరోజులు ప్రత్యేక క్యాంప్ జరుపుతున్నారు. డ్రాయింగ్.. మట్టి బొమ్మల తయారీతో పాటు ఆట, పాటలతో తీన్మార్ స్టెప్పులేయడం లాంటివి చేస్తూ వరంగల్ నిట్ లో ఎంజాయ్ చేస్తున్నారు స్టూడెంట్స్. రాష్ట్రాలు వేరైనా అందరు కలిసి కట్టుగా ప్రతిభకు మెరుగులు దిద్దుకుంటున్నారు.

విద్యార్ధుల్లో ఉత్సాహాన్ని నింపటం కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వరంగల్ ఎన్ఐటీ అధికారులు. విద్యార్థులలో భయాన్ని పోగొట్టి… వారిలో దాగి ఉన్న టాలెంట్ వెలికి తీసి.. స్కిల్స్ పెంచేందుకు ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తున్నారు. మొత్తం తొమ్మిది అంశాలపై…  10రోజుల పాటు నిపుణులతో శిక్షణ ఇప్పిస్తున్నారు. సీనియర్లు కూడా జూనియర్లకు క్లాసులు తీసుకుంటున్నారు. ఆరోగ్యం కోసం యోగా… డ్రాయింగ్.. డ్యాన్స్ లు నేర్పించి.. వారిలో ఉత్సాహాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.

మట్టితో బొమ్మలు తయారీ, ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిలిమ్స్ నిర్మాణం, సంగీత కచేరి, చిత్ర లేఖనం, శాస్త్రీయ సంగీతం, గిరిజన సంప్రదాయ కళలు, థియేటర్  ఆర్ట్స్  లాంటి అంశాలలో పాల్గొంటూ…. తమ ప్రతిభను చాటుకుంటున్నారు విద్యార్థులు. యోగా సాధనతో ప్రారంభమై రాత్రి వరకు వివిధ కార్యక్రమాల్లో ఉత్సహంగా పాల్గొంటున్నారు స్టూడెంట్స్.ఎన్ ఐటీలో ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయని అనుకోలేదంటున్నారు విద్యార్థులు. చదువుతో పాటు.. తమలోని టాలెంట్ బయటపెట్టేందుకు ఇదో మంచి అవకాశమని చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates