తీరం తాకిన పెథాయ్ తుపాను… తూర్పుగోదావరి జిల్లాలో కుండపోత

ఏపీ కోస్తా తీరాన్ని వణికించిన పెథాయ్ తుపాను తీరాన్ని తాకింది. తూర్పుగోదావరి జిల్లా ఖాట్రేనికోన దగ్గర తీరాన్నితాకింది. తుపాను తీరం తాకే సమయంలో… గంట‌కు 80 కిలో మీట‌ర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచాయి. తూర్పు గోదావ‌రి జిల్లా అంతటా…  ప‌లు ప్రాంతాల్లో బలమైన గాలులతో కూడిన భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. రాజోలు, స‌ఖినేటిప‌ల్లి, అమ‌లాపురం, మ‌లికిపురం, అంబాజీపేట‌, మామిడికుదురు, అల్ల‌వ‌రం, ఖాట్రేనికోన, ఉప్ప‌ల‌గుప్తం మండ‌లాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్ర‌జ‌లు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌) హెచ్చరికలు చేసింది.

Posted in Uncategorized

Latest Updates