తీరిన ఆంధ్రా అభిమాని కోరిక : TRS గెలువాలని..20 రోజులుగా ప్రార్థనలు

కృష్ణా : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో TRS సంచలన విజయం సాధించడంతో రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఏపీలో ఇప్పటికే పలుచోట్ల వేడుకలు చేసుకోగా..ఇవాళ డిసెంబర్ 12న కృష్ణా జిల్లా కొండపల్లి గ్రామం షావుకారి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇరవై రోజులగా తెలంగాణలో TRS గెలువాలని మోసిన్ అనే వ్యక్తి మదరసా పిల్లలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల ఫలితమే టిఆర్ఎస్ విజయం అంటూ ఆనందోత్సాహాలతో మదర్సా పిల్లలతో ఘనంగా వేడుకలు చేశారు.

విజయవాడలో..
తెలంగాణ రాష్ట్రంలో KCR ఘన విజయం సాధిస్తూ ముందుకు సాగడంతో..ఆంధ్రాలో తొలిసరిగా తెలంగాణ కేసీర్ అభిమాని కొణిజేటి ఆదినారాయణ విజయవాడలో స్వీట్లు పంపిణీ చేశారు. తెలంగాణలో కేసీఆర్ చేసిన అభివృద్ధి, పథకాలతో మరోసారు ప్రజలు కేసీఆర్ నే గెలిపించారన్నారు. ఇప్పటికయినా మహా కూటమిలోని రాజకీయ పార్టీలు బుద్ధి తెచ్చుకోవాలన్నారు.

Posted in Uncategorized

Latest Updates