తీర్థయాత్రలా కాళేశ్వరం : హరీష్

కాళేశ్వరం  ప్రాజెక్టును  చూసేందుకు  ప్రజలు  పెద్ద సంఖ్యలో  వస్తున్నారని  చెప్పారు  మంత్రి హరీష్ రావు. తీర్థయాత్రలకు  వెళ్లినట్టు  ప్రాజెక్టు   దగ్గరకు   క్యూ కడుతున్నారని  చెప్పారు. గురువారం (జూలై-19) డిప్యూటీ  స్పీకర్  పద్మా దేవేందర్ రెడ్డితో  కలిసి…మెదక్  పట్టణంలో  పర్యటించిన  మంత్రి ….పలు అభివృద్ది  పనులను ప్రారంభించారు. పేదలకు  కార్పోరేట్  వేద్యం  అందించేందుకు  ప్రభుత్వం  కృషి  చేస్తుందన్నారు  హరీష్ రావు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో  సర్కార్ దవాఖానా  అంటే  భయపడే  పరిస్థితి ఉండేదని… అయితే  ప్రభుత్వం  తీసుకుంటున్న చర్యలతో  ఇప్పుడు  జనం సర్కార్  హాస్పిటల్ కు  క్యూ  కడుతున్నారన్నారు.  పట్టణాభివృద్ది  జరగాలంటే  రోడ్ల  వెడల్పు  అవసరమని…ఇందుకు  వ్యాపారులు  సహకరించాలన్నారు.

Posted in Uncategorized

Latest Updates