పాపం బిచ్చగాళ్లు.. చలి ఇద్దరిని చంపేసింది

మహబూబ్‌ నగర్‌:  చలి తీవ్రతను తట్టుకోలేక ఇద్దరు వృద్ధులు చనిపోయిన ఘటన మహబూబ్ నగర్ లో జరిగింది.  రైల్వేస్టేషన్‌ లో భిక్షం అడుక్కుటూ జీవించే 80 ఏళ్ల వృద్ధుడుతో పాటు.. 70 ఏళ్ల మరో వృద్ధురాలు నిద్రిస్తున్నచోటే ప్రాణాలు వదిలారు.

బుధవారం పొద్దున 11 అయినా అక్కడి నుంచి లేవకపోవడంతో రైల్వే సిబ్బంది.. అనుమానంతో పోలీసులకు చెప్పారు. వాళ్లిద్దరూ చనిపోయారని పోలీసులు గుర్తించి.. డెడ్ బాడీలను పోస్ట్ మార్టమ్ కోసం స్థానిక జనరల్‌ హాస్పిటల్ కి తీసుకెళ్లారు.

ఏపీలో పెథాయ్ తుపాన్ కారణంగా తెలంగాణలో చలిగాలులు వీస్తున్నాయి. చలికి తట్టుకోలేకనే వృద్ధులు చనిపోయారని పోలీసులు చెప్పారు. చలి విషయంలో వృద్ధులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

 

 

Posted in Uncategorized

Latest Updates