తీవ్ర షాక్ లో క్రీడాకారులు : మీరు బాగా సంపాదించండి.. మేం ఎత్తుకెళతాం

susheelమీరు మెడల్ తీసుకువస్తే దండిగా డబ్బులు ఇస్తాం.. ఘనంగా సన్మానాలు చేస్తాం.. ఉద్యోగాలు ఇస్తాం.. కార్లు ఇస్తాం అంటూ క్రీడాకారులకు ప్రభుత్వాలు నజరానాలు ప్రకటించటం ఇప్పటి వరకు చూశాం.. ఇప్పుడు కొత్త రూల్ వచ్చింది. మన దగ్గర కాదులేండీ.. హర్యానాలో. మీరు బాగా కష్టపడి సంపాదిస్తే.. మేం వచ్చి ఎత్తుకెళతాం అంటూ క్రీడాకారులను అంటోంది. అవును.. అందుకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. రాష్ట్ర అథ్లెట్లు 1/3 వంతు ఆదాయాన్ని హర్యానా స్టేట్ స్పోర్ట్స్ కౌన్సిల్ కు డిపాజిట్ చేయాలని ఆ నోటిఫికేషన్ లో స్పష్టం చేసింది. 2018, ఏప్రిల్ 30న హర్యానా  ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రొఫెషనల్ స్పోర్ట్స్, వ్యాపార ఒప్పందాల వచ్చిన ఆదాయంలో మూడో వంతు డబ్బును స్పోర్ట్స్ కౌన్సిల్స్ కు ఇస్తే.. ప్రభుత్వమే రాష్ట్రంలో స్పోర్ట్స్ డెవలప్ మెంట్ కోసం ఆ నిధులు ఖర్చు చేయనున్నట్లు తెలిపింది.

ప్రపంచంలోనే ఇలాంటి రూల్ ఎక్కడా లేదని.. ఈ నిబంధన విని కళ్లు తిరిగి పడిపోయాం అంటున్నారు హర్యానా క్రీడాకారులు. ప్రభుత్వ నిర్ణయంపై మండిపడుతున్నారు. ఏ విధంగా మూడో వంతు ఆదాయం అడుగుతుందని.. కనీసం జ్ణానం లేదా అని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం తమతో చర్చించకపోవడం బాధాకరం అంటున్నారు. దీనిని సమర్ధించమని తెగేసి చెబుతున్నారు. అంటే.. ఇక నుంచి హర్యానా క్రీడాకారులు కోటి రూపాయలు సంపాదిస్తే.. అందులో 33 లక్షలు ప్రభుత్వం పట్టుకెళ్లిపోతుంది.

తుగ్లక్ పాలనలోనూ ఇలాంటి నిబంధన ఉండి ఉండదు.. మేం కష్టపడి సంపాదిస్తే ప్రభుత్వం వచ్చి పట్టుకెళుతుంది అంటా.. కనీసం అ.. ఆ.. కూడా తెలియని.. చదువుకోని నిరక్ష్యరాస్యులు ఈ పాలసీని తయారు చేసినట్లు కన్సిస్తుందంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు క్రీడాకారులు. తాము ఇప్పటికే తాము కాంపీషన్లలో సాధించిన డబ్బుపై పన్నులు కడుతున్న విషయం తెలియదా అని నిలదీస్తున్నారు. కోటి రూపాయలు ప్రైజ్ మనీ వస్తే.. ఆదాయ పన్ను కట్టిన తర్వాత మిగిలిన సొమ్ము ఇస్తున్నారని.. అందులో మళ్లీ మూడో వంతు ఎవడబ్బ సొమ్ము అని పట్టుకెళతారని నిలదీస్తున్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే.. రాష్ట్రానికి వచ్చే మెడల్స్ సంఖ్య తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు. క్రీడాకారుల ప్రతిభపై దీని ప్రభావం పడుతుందని క్రీడాకారులు హెచ్చరిస్తున్నారు. అసలు మేం సంపాదిస్తే.. ప్రభుత్వం వచ్చి పట్టుకెళ్లటం ఏంటో అర్థమే కావటం లేదు అంటున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates