తీసుకున్న డబ్బులు ఇచ్చేయండి : 70వేల మంది ఉద్యోగులకు SBI షాక్

నోట్ల రద్దు సమయంలో ఓవర్ టైం పని చేసిన 70 వేల మందికిపైగా బ్యాంకు ఉద్యోగులు కోపంగా ఉన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్ కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ జైపూర్ బ్యాంకులలోని అధికారులు, ఉద్యోగులు.. ఎక్కువ గంటలు పనిచేసినందుకు ఉద్యోగులకు ఓవర్ టైం పరిహారాన్ని అందుకున్నారు. ఏప్రిల్-1, 2017న SBIలో విలీనమయ్యాయి. దీంతో ఈ బ్యాంకుల్లో ఎక్స్ ట్రా వర్క్ కు పరిహారాన్ని అందుకున్న వారందరూ తిరిగి రిటర్న్ చేయాలని SBI.. అన్నీ జోనల్ హెడ్ క్వార్టర్లకు ఓ మెసేజ్ ఇచ్చింది.

ఆ మెసేజ్ ప్రకారం.. తమ సొంత ఉద్యోగులకు మాత్రమే పరిహారం ఇస్తామని.. మిగతావారికి ఇచ్చేది లేదని SBI తేల్చి చెప్పింది. డీమానిటైజేషన్ సమయంలో ఈ బ్యాంకులన్నీ SBIలో విలీనం కాలేదని, దీంతో ఓవర్ టైం పనిచేసిన స్టాఫ్ కి పరిహారాన్ని ఇవ్వాల్సిన భాద్యత ఆ ఐదు బ్యాంకులదేనని, తమకు సంబంధం లేదని తెలిపింది. నోట్ల రద్దు సమయంలో.. ప్రజల నోట్ల కష్టాలను తీర్చేందుకు రోజులో 3-8 అదనపు గంటలు బ్యాంకు ఆఫీసర్లు, ఉద్యోగులు పనిచేశారు. ఆఫీసర్లకు అదనపు పనికి రూ.30వేలు, స్టాఫ్ కి రూ. 17వేలు చెల్లించారు. ఇప్పుడు ఆ డబ్బు అంతా తిరిగి కట్టాలంటూ SBI తీసుకున్న నిర్ణయంపై బ్యాంకు ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేమేమైనా పశువుల్లా కనిపిస్తున్నామా అంటూ SBI తీరుని తప్పుబడుతున్నాయి. అయితే ఇప్పటివరకూ దీనిపై ఎస్ బీఐ స్పందించలేదు.

Posted in Uncategorized

Latest Updates