తుపాకీ మిస్ ఫైర్.. బాలుడి మృతి

స్కూల్ పిల్లలు సెలవు రోజున తోటి స్నేహితులతో ఆడుకుంటారు. కొందరు ఇంట్లో అమ్మలకు సహాయంగా ఉంటారు.. మరి కొందరు తండ్రికి సహాయంగా పనులకు వెళ్తారు. అలా.. సెలవు రోజున తండ్రికి సహాయంగా ఉందామని గేదెలను మేపడానికి వెళ్లిన బాలుడికి అనుకోని ఆపద ఎదురై మృత్యువు కబలించింది. ఈ ఘటన కృష్ణా జిల్లా గుడివాడ లో జరిగింది.  శేరిధింటికుర్రు గ్రామంలో నాటు తుపాకీ మిస్‌ ఫైర్‌ అయి ఎనిమిదో తరగతి చదువుతున్న బాలుడు  చనిపోయాడు. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో నివాసం ఉంటున్న చిటికనేని నాని వ్యవసాయం చేస్తూ తన కుటుంబాన్ని నడుపుతున్నాడు. అతని కొడుకు కరుణానిధి (14) ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. రెండో శనివారం సెలవు కావడంతో తండ్రికి సహాయంగా గేదెలను మేపడానికి చెరువు గట్టుపైకి వెళ్లాడు.

ఆ 100 ఎకరాల చేపల చెరువుపై పక్షులను వాలనీయకుండా ఉండేందుకు నాటు తుపాకీని గాల్లోకి కాల్చేవారు. ఇందుకు ఓ వ్యక్తిని నీయమించాడు చెరువు యజమాని. కరునానిధి చెరువు గట్టు పై ఉన్నప్పుడు ఆ వ్యక్తి పక్షులను తరిమేందుకు తుపాకీని కాల్చాడు. దీంతో అది పట్టు తప్పి అక్కడే ఉన్న బాలుడి తలకు తుపాకీ లోంచి వచ్చిన బుల్లెట్ తగిలింది. బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు కేసును నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates