తుఫాను సాయం.. కుటుంబానికి 50కేజీల బియ్యం

శ్రీకాకుళం : తిత్లీ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తుఫాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. అధికారులతో కలిసి సమీక్ష జరిపారు. తుపాను నష్టంపై అంచనాలు సిద్ధం చేయమని ఆదేశాలు ఇచ్చారు. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని సూచించారు.

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసరాలు కూడా దొరకని పరిస్థితి ఉందని… అధికారులు అప్రమత్తంగా ఉండి వారికి అవసరమైనవి అందించాలని చంద్రబాబు సూచించారు. వెంటనే ఒకో కుటుంబానికి యాభై కేజీల బియ్యం , కిలో కందిపప్పు, కిలో ఆలు గడ్డలు, కిలో ఉల్లి గడ్డలు, లీటర్ నూనె, అర కిలో చక్కెర అందించాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రత్యేకంగా ప్యాకింగ్ చేసి… ఈ నిత్యావసరాలను బాధితులకు అందించాలన్నారు.

మరోవైపు… వరద ముంపు ప్రాంతాల్లో ఎన్టీఆర్ఎఫ్, నేవీ బృందాలు, వాలంటీర్లు సహాయం అందిస్తున్నారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో బాధితులకు లైఫ్ జాకెట్లు పంపిణీ చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చే సాయంతో సంబంధం లేకుండా పలువులు వాలంటీర్లు నేవీ సాయంతో.. ఆహార పదార్థాలు అందిస్తున్నారు.

 

 

Posted in Uncategorized

Latest Updates