తుఫాను సాయం రూ.12వందల కోట్లివ్వండి.. మోడీకి బాబు విన్నపం

అమరావతి : తిత్లీ తుఫాను బీభత్సంతో దెబ్బతిన్న ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాలను ఆదుకునేందుకు కేంద్రప్రభుత్వం ముందుకు రావాలని కోరారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తుఫాను బాధిత ప్రాంతాలను ఆర్థికంగా ఆదుకోవాలంటూ ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లెటర్ రాశారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు బాగా నష్టపోయాయని చంద్రబాబు మోడీకి తెలిపారు. మధ్యంతర సాయంగా ప్రస్తుతానికి రూ.12 వందల కోట్లు విడుదల చేసి ఆదుకోవాలని కోరారు ఏపీ సీఎం.

తిత్లీ తుఫాను విరుచుకుపడటంతో… శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. భారీవర్షానికి పలు ఊళ్లు నీళ్లలో మునకేశాయి. ఎన్డీఆర్ఎఫ్ , నేవీ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి. నిరాశ్రయులకు రెడ్ క్రాస్ సహా పలు సహాయ బృందాలు ఆహారం పొట్లాలు అందిస్తున్నాయి. చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి జరిగిన నష్టంపై అంచనా వేశారు. కేంద్రం నుంచి సాయం కోరుతూ లెటర్ రాశారు. వరద బాధిత కుటుంబాలకు యాభై కేజీల బియ్యం, కేజీ చొప్పున కందిపప్పు, ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు, లీటర్ వంట నూనె, అర కిలో చక్కెర ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించారు సీఎం.

Posted in Uncategorized

Latest Updates