తుఫాన్ బీభత్సం : యెమెన్, ఓమన్ దేశాలు అతలాకుతలం

OMANమెకును తుఫాను బీభత్సానికి యెమెన్, ఓమన్ దేశాలు అతలాకుతలం అయ్యాయి.  అత్యంత భీకరమైన మెకును తుఫాను అరేబియా ద్వీపకల్పంలోని యెమెన్, ఓమన్ దేశాలను అతలాకుతలం చేసింది. తుఫాను కారణంగా 13 మంది చనిపోగా.. .. 40 మంది గల్లంతయినట్టు వెల్లడించారు అధికారులు. యెమెన్ ద్వీపం సొకొత్రాను అతలాకుతలం చేసిన ఉష్ణమండల తుఫాన్ మెకును అరేబియన్ ద్వీపకల్ప తీరాన్ని దాటింది.

ఆదివారం (మే-27) సొకొత్రా ద్వీపాన్ని బలంగా తాకిన తుఫాను కారణంగా అక్కడ నివసించే 40 మంది గల్లంతు కాగా.. ఇద్దరి మృతదేహాలు లభించాయి. ఈ క్రమంలోనే సోమవారం (మే-28) ఓమన్‌ లో ఓ 12 ఏండ్ల బాలిక సహా ముగ్గురు చనిపోయినట్టు అధికారులు వెల్లడించారు. ప్రచండ గాలులు బలంగా వీయడంతో బాలిక గోడకు ఢీకొని చనిపోయినట్టు రాయల్ ఓమన్ పోలీసులు తెలిపారు.  సొకొత్రా ద్వీపంలో గల్లంతైనవారిలో యెమెన్, సుడాన్ దేశాలవాసులతోపాటు భారతీయులు కూడా ఉన్నారు. తీవ్రమైన వరదల్లో వేలసంఖ్యలో జంతుజాలం కొట్టుకుపోయినట్టు తెలుస్తున్నది.

మొత్తం ద్వీపంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.  230 కుటుంబాలను యెమనీ భద్రతా సిబ్బంది పునరావాస ప్రాంతాలకు తరలించారు. తుఫాను ప్రభావం తగ్గుముఖం పట్టిన తర్వాత UAE , సౌదీ నుంచి పలువురు మానవతా సహా య కార్యకర్తలు పునరావాస కార్యక్రమాలు చేపట్టారు. శుక్రవారం అరేబియా ద్వీపకల్ప తీరాన్ని దాటిన తుఫాన్ ఓమన్‌ లో మూడో అతిపెద్ద పట్టణమైన సలాలాహ్‌ను అతలాకుతలం చేసింది. బలమైన గాలులు, వర్షం కారణంగా పరిస్థితులు భయానకంగా మారిపోయాయి. పర్యాటకులతో కళకళలాడే బీచ్‌ లు నిర్మానుష్యంగా మారిపోగా.. పట్టణంలోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ మూతపడింది. సలాలాహ్ పోర్ట్‌ ను మూసేశారు. నిరాశ్రయులకోసం అధికారులు స్కూళ్లను తెరిచారు. ఓ స్కూల్లో  600 మంది కార్మికులు తలదాచుకున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates