తుస్సుపటాక్… నిజం కాని లగడపాటి సర్వే

ఆయనకు ఆంధ్ర ఆక్టోపస్ అని పేరు. పొలిటికల్ జోస్యాలు వాస్తవానికి దగ్గరగా చెబుతారని ఆయనకు బాగా పేరుండేది. కానీ.. తెలంగాణ సర్వే విషయంలో ఆయన అంచనా మొత్తం తలకిందులైంది. ఆయనే విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సర్వేకోసం ఎప్పుడూ పడనంత కష్టపడ్డానని…. చాలా శ్రమించామని… చకాచకా మారిపోయిన పరిస్థితులను అంచనా వేసి సర్వే చెబుతున్నామని అన్నారు. కానీ… ఆయన సర్వే ఫలితాలు ఏమాత్రం నిజం కాలేదు. పూర్తి భిన్నమైన ఫలితాలు వచ్చాయి. టీఆర్ఎస్ బ్లాక్ బస్టర్ బంపర్ విక్టరీ కొట్టింది. తిరుగులేని మెజారిటీతో మరోసారి అధికారంలోకి రాబోతోంది.

అప్పట్లో బిహార్ లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని లగడపాటి చెప్పినప్పటికీ… అక్కడ నితీష్, లాలూ కూటమి అధికారంలోకి వచ్చింది. తాజాగా తెలంగాణలో ప్రజాకూటమి అధికారంలోకి వస్తుందని లగడపాటి రాజగోపాల్ చెప్పినప్పటికీ.. ఆయన సర్వే పూర్తిగా తేడాకొట్టింది. నేషనల్ ఛానెల్స్ అన్నీ… ఎగ్జిట్ పోల్స్ లో టీఆర్ఎస్ కే పట్టం కట్టినప్పటికీ… ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ మాత్రం TRS ఓటమి పాలవుతుందని చెప్పారు. తెలంగాణ ఎన్నికలపై జాతీయ సర్వేల అంచనాలకు మించి TRS అత్యధిక స్థానాలు గెలుచుకుంది. లగడపాటి చెప్పినట్లుగా ఇండిపెండెంట్లు చెప్పుకోదగ్గ స్థానాల్లో గెలవలేకపోయారు. కాంగ్రెస్ 65 స్థానాలు గెలుచుకుంటుందని చెప్పిన ఆంధ్రా ఆక్టోపస్ పూర్తిగా విఫలమయ్యారు. లగడపాటి సర్వే ప్రకారం మహాకూటమి సీట్లు సాధించకపోగా… ఘోరంగా ఓడిపోయింది.

కౌంటింగ్ కు ముందు…. లగడపాటి సర్వేను చిలకజోస్యంతో పోల్చారు కేటీఆర్. ఈ సర్వే నిజం కాబోదని… భవిష్యత్తులో లగడపాటి సర్వేలను నమ్మే పరిస్థితి ఉండదని చెపప్రు. తెలంగాణ దెబ్బకు రాజకీయ సన్యాసం తీసుకున్న లగడపాటి… ఇప్పుడు ఈ షాక్‌తో సర్వేల సన్యాసం తీసుకోవడం తథ్యమన్నారు కేటీఆర్. మరి ఇకనుంచి సర్వేలపై లగడపాటి ఏమంటారో చూడాలి.

 

 

ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు..? కింద లింక్ క్లిక్ చేయండి

Telangana Assembly Election Results 2018 Live Updates

Posted in Uncategorized

Latest Updates