తూత్తుకుడిలో ఉద్రిక్తతలు..వ్యక్తి మృతి

THUTHIKUDIతమిళనాడులోని తూత్తుకుడిలో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగాయి. మంగళవారం (మే-22)న జరిగిన ఘటనల్లో గాయపడినవారికి చికిత్స అందిస్తున్న… జనరల్ హాస్పిటల్ ముందు ఆందోళనకారులు నిరసనకు దిగారు. దీంతో బుధవారం (మే-23) వారిని చెదరగొట్టేందుకు భారీగా బలగాలను మోహరించారు. అక్కడే ఒక బస్ ను ఆందోళనకారులు తగలబెట్టారు.

అన్నానగర్ ప్రాంతంలో జరిగిన గొడవలో ఒక వ్యక్తి చనిపోయాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడి జనరల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నవారిని DMK వర్కింగ్ ప్రెసిడెంట్… MK స్టాలిన్ పరామర్శించారు. అంతకుముందు మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్, DMDK అధ్యక్షుడు వైకో, పీసీసీ చీఫ్ తిరునావుక్కరసర్ కూడా గాయపడ్డవారిని పరామర్శించారు.

Posted in Uncategorized

Latest Updates