తూత్తుకూడిపై కన్నీళ్లు పెట్టిన బాషా : ఒక్కో బాధిత కుటుంబానికి రూ.2లక్షలు

Rajini
తమిళనాడు రాష్ట్రం తూత్తుకూడి ఘటన రోజురోజుకి పొలిటికల్ ఇష్యూగా మారిపోతుంది. పోలీస్ కాల్పుల్లో చనిపోయిన 13 మంది బాధిత కుటుంబాలను రోజుకొకరు చొప్పున పరామర్శిస్తూ వస్తున్నారు. మే 30వ తేదీ బుధవారం సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయా కుటుంబాల ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. అదే విధంగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని కూడా కలిశారు. ఈ సందర్భంగా రజనీకాంత్ తన గొప్ప మనస్సు చాటుకున్నారు. పోలీస్ కాల్పుల్లో మృతి చెందిన ఒక్కో కుటుంబానికి రూ.2లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. తన సొంత డబ్బును వీరికి అందజేయనున్నట్లు తెలిపారు. గాయపడిన వారి వైద్య ఖర్చులకు కూడా సాయం చేయనున్నట్లు వెల్లడించారు రజనీకాంత్.

ఈ ఘటనపై ఇంతకన్నా ఎక్కువగా కామెంట్ చేయదల్చుకోలేదన్నారు. అయితే ప్రభుత్వం ఇంకా జాగ్రత్తగా వ్యవహరించి ఉండాల్సింది అన్నారు. ప్రజలు అన్నీ చూస్తున్నారన్నారు. పోలీసుల కాల్పులు అతిపెద్ద తప్పుగా రజనీ అభివర్ణించారు. ఇలాంటి ఘటనల వల్ల ప్రభుత్వాలపై ప్రజలకు విశ్వాసం పోతుందన్నారు. ప్రజలను రక్షించాల్సిన పోలీసులే.. సహనం కోల్పోయి విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడటం ముమ్మాటికీ తప్పే అన్నారాయన. ఇవాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.

 

Posted in Uncategorized

Latest Updates