తూత్తుకూడి ఆందోళన : సంక్షోభంలో 32వేల మంది ఉపాధి

Thoothukudi-plantతమిళనాడు రాష్ట్రం తూత్తుకూడిలో స్టెరిలైట్ రాగి ఫ్యాక్టరీ వివాదం ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. పోలీస్ కాల్పుల్లో 12 మంది చనిపోవటం, పొల్యూషన్ పై హైకోర్టు హెచ్చరించటంతో ఫ్యాక్టరీ షెట్ డౌన్ చేస్తున్నారు. ఇక్కడితో ఆందోళనకారుల ఉద్యమం ఫలించినా.. ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. ఈ రాగి ఫ్యాక్టరీపై ఆధారపడి 32వేల మంది జీవనం సాగిస్తున్నారు. కంపెనీ కింద 3వేల 500 మంది ఉద్యోగులు ఉన్నారు. వారితోపాటు 2వేల 500 మంది కంట్రాక్ట్ వర్కర్స్ పని చేస్తున్నారు. వీరితోపాటు మరో 30వేల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం వీరికి గడ్డుకాలం వచ్చింది.

100 రోజులుగా ఆందోళనలు, పోలీస్ కాల్పుల క్రమంలో ఫ్యాక్టరీని తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించింది యాజమాన్యం. ఈ క్రమంలోనే కంపెనీ ఉద్యోగులు అయిన 3,500, కాంట్రాక్టర్ కార్మికులు అయిన 2,500 మందికి నోటీసులు ఇచ్చినట్లు స్టెరిలైట్ కాపర్ సీఈవో పి.రాంనాథ్ వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మాకు ఇంత కంటే మరో మార్గం లేదని తెలిపారు. పరోక్షంగా ఉపాధి పొందుతున్న సరఫరాదారులు, అమ్మకం దారులు, రవాణాదారులు, కాపర్ వైర్ యూనిట్స్ లో ఉపాధి పొందుతున్న 30వేల మంది జీవితాలపై ప్రభావం పడనున్నాయని చెబుతోంది కంపెనీ. ప్రస్తుతం కంపెనీ నాలుగు లక్షల టన్నులు.. విస్తరణలో భాగంగా రెండింతలు చేయాలని నిర్ణయించింది. ఫ్యాక్టరీ నుంచి వచ్చే కాలుష్యంతో నీళ్లు, భూమి, గాలి విషంగా మారుతున్నాయని ఆందోళనలు చేస్తున్నారు స్థానికులు. విస్తరణపై కోర్టు కూడా స్టే విధించింది. దీంతో కంపెనీ మనుగడపైనే ప్రభావం పడింది. ఇప్పుడు 32వేల మంది ఉపాధి సంక్షోభంలో పడింది. ఈ విషయంలో తమిళనాడు ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది.. వీరికి ప్రత్యామ్నాయ ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తుందా లేదా అనేది చూడాలి…

Posted in Uncategorized

Latest Updates