తూత్తుకూడి ఘటన : నల్ల దుస్తులతో DMK నిరసన

THUTHIKUDIతమిళనాడు ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది తూత్తుకూడి ఘటన. పోలీసు కాల్పుల్లో 13 మంది మరణించటంపై విపక్షపార్టీ డీఎంకే సభ్యులు అసెంబ్లీలో నిరసన తెలిపారు. స్టాలిన్ వర్గం నల్లదుస్తులతో సమావేశాలకు హాజరై స్టెరిలైజ్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్టెరిలైజ్ ఫ్యాక్టరీని మూసివేయాలని డిమాండ్ చేశారు. పదిరోజులుగా తూత్తుకూడిలో ఉద్రిక్త పరిస్థితులున్న ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టలేదని డీఎంకే ఆరోపించింది. సర్కార్ వైఫల్యం వల్లే 13 మంది నిరసనకారులు చనిపోయారని డీఎంకే నేత స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేశారు.

విష కాలుష్యాలు వెదజల్లుతున్న స్టెరిలైట్ రాగి ఫ్యాక్టరీని మూసేయాలంటూ మే 22న తూత్తుకూడి భారీఎత్తున ఆందోళన జరిగిన సంగతి తెలిసిందే. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరపడంతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆందోళనకారులకు మద్దతుగా ప్రతిపక్షాలు ఉద్యమించడంతో… స్టెరిలైట్ ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసివేస్తూ తమిళనాడు ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. అసెంబ్లీ సమావేశాల్లో తూత్తుకుడి ఘటనతో పాటు కావేరీ జల వివాదం, నీట్ పరీక్షలు, గుట్కా కుంభకోణం తదితర అంశాలను లేవనెత్తేందుకు ప్రతిపక్షాలు వ్యూహం సిద్ధం చేశాయి.

Posted in Uncategorized

Latest Updates