తెలంగాణకి 3 స్వచ్ఛ అవార్డులు

స్వచ్ఛ భారత్ అమలులో చేసిన కృషికి గాను తెలంగాణ ప్రభుత్వం మూడు అవార్డులను సొంతం చేసుకుంది. వివిధ కార్యక్రమాలను గ్రామాల్లో విస్తృతంగా నిర్వహిస్తున్నందుకు రాష్ర్ట ప్రభుత్వానికి,పెద్ద పల్లి,వరంగల్ అర్బన్ జిల్లాలకు ఈ అవార్డులు లభించాయి. అక్టోబర్.2న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో కేంద్ర మంత్రి చేతుల మీదుగా రాష్ర్ట ప్రభుత్వ ప్రతినిధులు,రెండు జిల్లాల కలెక్టర్లు  ఈ అవార్డులను అందుకోనున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన పారిశుద్ధ్య పురోగతి కార్య్రకమాలు  రాష్ర్ట ప్రభుత్వానికి  అవార్డును తెచ్చిపెట్టినట్లు పంచాయితీ రాజ్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ కమిషనర్ నీతూకుమారి ప్రసాద్ తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates