తెలంగాణకు ఏం కావాలో కేసీఆర్ కు మాత్రమే తెలుసు.. అందుకే గెలిపించారు : కవిత

తెలంగాణ గురించి కేసీఆర్ కు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదని .. అందుకే జనం టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారని చెప్పారు నిజామాబాద్ ఎంపీ కవిత. నాలుగున్నర ఏళ్లలో టీఆర్ఎస్ ప్రజలకు అందించిన  పథకాలే ఈ విజయానికి కారణమని చెప్పారు. ఈ విజయం.. నంబర్లు అన్నీ నిజానికి కేవలం పేపర్లకే పరిమితం అన్నారు కవిత. టీఆర్ఎస్ పార్టీని జనం తమ గుండెల్లో పెట్టుకున్నారని చెప్పారు. గ్రౌండ్ లెవెల్లో జనంతో కలిసిపోయిన పార్టీ ఒక్క టీఆర్ఎస్ మాత్రమే అన్నారు కవిత.

రేపు టీఆర్ఎస్ జాతీయ అజెండాను ప్రకటిస్తాం

ఆంధ్రాలో తన తప్పులన్నింటినీ కవర్ చేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించి… తెలంగాణ ప్రజాకూటమిలోకి ఎంట్రీ ఇచ్చారని.. జనం విపక్షాల కలయికను అంగీకరించలేదనడానికి ఫలితాలే ఓ ఉదాహరణ అని చెప్పారు కవిత. టీఆర్ఎస్ ఇపుడు మరింత విస్తరిస్తుందని… జనానికి మరింతగా రీచ్ అవుతుందని చెప్పారు కవిత. జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ తనదైన ముద్ర వేస్తుందని అన్నారు. జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయం రావాల్సిన అవసరం ఉందని.. రేపు మా జాతీయ అజెండాను ప్రకటిస్తామని చెప్పారు కవిత.

ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు..? కింద లింక్ క్లిక్ చేయండి

Telangana Assembly Election Results 2018 Live Updates

Posted in Uncategorized

Latest Updates