తెలంగాణకు కేంద్ర బలగాలు పంపండి.. రజత్ కుమార్ రిక్వెస్ట్

హైదరాబాద్ : డిసెంబర్ ఏడున రాష్ట్ర అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల ఏర్పాట్లలో రాష్ట్ర ఎన్నికల అధికారుల బృందం బిజీగా ఉంది. ఎన్నికల నిర్వహణపై జిల్లాల్లోని అధికారులకు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పిస్తున్నారు. కోడ్ అమలులోకి రావడంతో… ఎన్నికల ప్రచారంపైనా రాజకీయ పార్టీలకు సూచనలు ఇచ్చారు. డబ్బు తరలింపుపైనా పోలీస్, నిఘా సంస్థలతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నారు.

రాష్ట్రంలో ఎన్నికల బందోబస్తుపై ఇప్పటికే డీజీపీ మహేందర్ రెడ్డి, ఇతర పోలీస్ శాఖల ఉన్నతాధికారులతో రజత్ కుమార్ సమావేశం అయ్యారు. 31 జిల్లాల్లో ఎన్నికల బందోబస్త్ కు అవసరమయ్యే బలగాలపై ఓ అంచనాకు వచ్చారు. అదనపు బలగాలు అవసరమంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర సీఈఓ రజత్ కుమార్ లెటర్ రాశారు. ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేకంగా 25 కంపెనీల కేంద్రబలగాలు కావాలంటూ లేఖలో సీఈసీకి సమాచారం ఇచ్చారు రజత్ కుమార్.

Posted in Uncategorized

Latest Updates